calender_icon.png 28 December, 2024 | 4:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీవారి భక్తులకు తీపికబురు

28-12-2024 01:18:02 AM

  1. ఇక నుంచి పరిగణలోకి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సులు 
  2. పదేళ్ల తర్వాత టీటీడీ బోర్డు కీలక నిర్ణయం

హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): తెలంగాణ నుంచి తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి వెళ్లేలా భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థాన (టీటీడీ) బోర్డు  తీపికబురు అందించింది. ఇక నుంచి తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రుల సిఫార్సు లేఖలను పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.

వారానికి రెండు రోజుల పాటు ఈ సిఫార్సులు పరిగణలోకి తీసుకుని, భక్తులకు శ్రీవారి శీఘ్ర దర్శనానికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నది. గడిచిన పదేళ్ల నుంచి టీటీడీ ఇక్కడి ప్రజాప్రతినిధులు భక్తులకు ఇచ్చిన సిఫార్సు లేఖలను ఖాతరు చేయలేదు. దీంతో లేఖలు బుట్టదాఖలయ్యాయి.

కొద్దిరోజుల నుంచి రాష్ట్రప్రభుత్వం చేసిన విజ్ఞప్తులకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు టీటీడీకి మార్గదర్శకాలు వెళ్లడంతో తాజాగా ప్రకటన వెలువడింది.