- ప్రజలకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): 2024 సంవత్సరం తెలంగాణ బీజేపీకి మధురస్మృతులను మిగిల్చిందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదలచేశారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ర్టంలో బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు గెలిచిందని పేర్కొన్నారు.
మోదీ 3.0 ప్రభుత్వంలో తెలంగాణ మెరుగైన భాగస్వామ్యం పొందిం భు రాష్ర్టంలో పోలైన మొత్తం ఓట్లలో 77,43,947 ఓట్లను సొంతం చేసుకున్న బీజేపీ, 36 శాతం ఓట్లతో తెలంగాణవ్యాప్తంగా గణనీయమైన ప్రభావం చూపిం తెలిపారు. బీజేపీని తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ పట్ల ప్రజలు చూపిస్తున్న ఈ ఆదరాభిమానాలు 2025 లోనూ కొనసాగుతాయని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. 2025లో ప్రజలందరికీ మంచి చేకూరాలని, సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.