calender_icon.png 10 April, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీపి జ్ఞాపకాలు

06-04-2025 12:00:00 AM

ఇది గుర్తుందా?

అప్పట్లో జాతరలో చైనా ప్లాస్టిక్ బొమ్మలెన్ని కొన్నా.. ఒక్క రూపాయికే దొరికే ఈ చిన్న ఇనుప వస్తువును మాత్రం చాలా స్పెషల్‌గా చూసేవాళ్లం. దీని ధర త క్కువే అయినా.. అన్ని షా పుల్లో దొరికేది కాదు. దీ న్ని చేతిలో పట్టుకుని బొటనవేలితో నొక్కితే టిక్ టిక్ అని శబ్దం వచ్చేది.

శబ్దం ఎక్కువగా రావాలంటే.. కొంచెం బలంగా నొక్కాలి. అప్పట్లో ఇలాంటి ఆటబొమ్మలు, కాగితపు పడవలు, పిచ్చుక గూళ్లతోనే మన రోజు గడిచేది. ఈకాలం పిల్లలు స్మార్ట్‌ఫోన్లు, వీడియో గేమ్స్‌తో బిజీగా మారి బాల్యాన్ని సెల్‌ఫోన్‌కే అంకితం చేస్తున్నారు. 

పాము గోళీలు..

చిన్ననాటి జ్ఞాపకాలు మన మనసులో ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన క్షణాలు. అవి మన జీవితంలోని అత్యంత విలువైన నిధులు. ఈ వేగవంతమైన జీవితంలో, మనం రోజూ ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ఉంటాం. కానీ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నప్పుడు కలిగే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. దీపావళి వచ్చిందంటే.. నాన్నతో పటాసులు తీసుకురమ్మని చెప్పేవాళ్లం.

అందులో కుక్క బాంబులు, లక్ష్మీపటాసులు, వంకాయ బాంబులు, కాకరపువ్వొత్వొలు, భూచక్రాలు, రాకెట్లు వంటివి ఎన్నో ఉండేవి. అవి ఇప్పటికీ ఉన్నాయి. వీటితో పాటు చిన్న డబ్బా లో నల్లగా పాము గోళీలు కూడా ఉండేవి. వాటిని కాల్చితే.. నల్లని పొగతో పాటు పాము లాంటి ఆకారంపైకి వచ్చేది. దాన్ని బాగా ఎంజాయ్ చేసేవాళ్లు.