calender_icon.png 25 March, 2025 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీపి జ్ఞాపకాలు

23-03-2025 12:00:00 AM

గోలి సోడా

మీకు గుర్తుందా? చిన్నప్పుడు అమ్మమ్మ ఊర్లో.. వేసవి సెలవులకు వెళ్తే.. ఎలా ఎంజాయ్ చేసేవాళ్లమో? ఆట మధ్యలో బాగా దాహమేస్తే.. ఒక్క అర్ధ రూపయిస్తే గోలి సోడా ఇచ్చే వాళ్లు.. అది తాగుతుంటే మజా వేరే లెవల్లో ఉండేది. దాంట్లో ఇంకా కలర్ సోడా అయితే మహా సరదా.. గోలి సోడా సీసా కొట్టినప్పుడు వచ్చే సౌండ్ మర్చిపోగలమా? ఆ సౌండ్ వచ్చేటప్పుడు ప్రత్యేకంగా గమనించేది. ఆకాలంలో వీటికి భలే క్రేజ్ ఉండేది.   

పిస్తోలు రీలు..

చేతిలో పిస్తోలు లేకపోయినా.. రీలు కొన్న రోజులు మీకు గుర్తున్నాయా? దీపావళి వచ్చిదంటే రూపాయి ఇచ్చి కొనేవాళ్లం. ఆ రూపాయి కోసం అమ్మా, నాన్న వెంటపడ్డరోజులు మర్చిపోగలమా?  చిన్నప్పుడు చాలామంది దగ్గర  పిస్తోలు ఉండేది కాదు కాని రీలు కొనేవాళ్లం. ఎందుకంటే వాటిని చేతితో గోడకేసీ గీకటమో.. రోడ్ మీద రాకటమో.. ఏం చేసినా సౌండ్ మాత్రం పక్కా దీపావళికి నెలముందు నుంచి రీలు హడావిడి మామూలుగా ఉండేదికాదు.