16-03-2025 12:00:00 AM
ఉయ్యాలా.. జంపాలా..
ఉయ్యాల.. ఆ పేరు వింటే చాలు గతకాలపు జ్ఞాపకాలు మనసును ఊయలలూపుతాయి. గుండెగూటిలోని ఊసులన్నీ నిద్రలేస్తాయి. అందుకేనేమో ‘కొమ్మ ఉయ్యాల... కోన జంపాల... అమ్మ ఒళ్లో నేను రోజూ ఊగాల’ అంటూ ఊయలమీద పాటలు రాసిన సినీ కవులున్నారు. అమ్మఒడిని మించిన హాయి ఇంకెక్కడ దొరుకుతుంది అన్న ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ఉయ్యాల. ఆ రోజుల్లో అందంగా తయారుచేసిన చెక్క ఉయ్యాలలుండేవి. పిల్లలను అందులో వేసి నిద్రపుచ్చేవారు తల్లులు.
తాళాల గుత్తి
ఆనాటి వస్తువులు అపురూపంగా ఉండటమే కాకుండా.. ఎంతో భద్రతనిచ్చేవి కూడా. ఇంటికి వాడే తాళం, తాళం చెవి విభిన్నంగా ఉండేవి. ఇనుముతో తయారుచేసిన తాళాల చెవులు ప్రతి ఇంట్లో కనిపించేవి. వీటిని ఆరోజుల్లో ప్రత్యేకంగా తయారుచేయించుకొని గుత్తిగా వాడుకునేవారు.
పెన్‌పహాడ్, విజయక్రాంతి