భలే కర్రబిళ్ల
ఈ ఆటను ఎక్కువుగా రెండు గ్రూప్‌లుగా విడిపోయి ఆడుతుంటారు. దీనివల్ల నాయకత్వ లక్షణాలు అలవడుతాయి. కర్రతో బిళ్లను కొట్టి వెళ్లిన దూరాన్ని కొలుస్తారు. ఎవరు ఎక్కువ దూరం కొడతారో వారు గెలుచినట్టు. శారీరకంగా ఎక్కువగా ఆడుకోవడం వల్ల సాయంత్రానికి ఇంటికి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా వారి పనులు వారు చేసుకుంటారు. తాత, నానమ్మలతో సంతోషంగా గడుపుతారు. వారు ఆ రోజు ఆడిన ఆటలు గురించి చెబుతారు. దీనివల్ల వారికి భాషాభివృద్ధి కూడా పెరుగుతుంది.
ఒక సిరా చుక్క..
జ్ఞాపకాలు ఎప్పటికీ అపురూపమే. ఒకప్పుడు ఎన్నో జ్ఞాపకాలకు అక్షరరూపమిచ్చింది ఇంక్ పెన్నులే. ఆ కాలంలో ఏదైనా రాయాలన్నా, అక్షరానికి ప్రతిరూపం ఇవ్వాలన్నా ఇంక్ పెన్నులపైనే ఆధారపడేవారు. పెన్నులో ఇంక్ అయిపోతే.. సిరాబుడ్డిలోని ఇంక్‌ను నింపుకొని మళ్లీ వాడేవారు.
బాల్ పాయింట్ పెన్నులు వచ్చాక ఇంకు పెన్నులు పక్కకుపోయాయి. కానీ ఇంక్ పెన్నులపై ఇష్టంతో మన పెద్దోళ్లు ఇప్పటికీ వాడుతున్నారు. స్మార్ట్ పెన్నులు, బాల్ పెన్నులు ఎన్నో రకాల పెన్నులు అందుబాటులోకి రావడంతో ఇంక్ పెన్నులు నోస్టాల్జియాగా మిగిలాయి.