calender_icon.png 8 January, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీపి జ్ఞాపకాలు

06-01-2025 12:00:00 AM

అబ్బో.. ఏడు వారాల నగలు

ఎన్ని కాలాలు, యుగా లు మారినా బంగారానికి ఉన్న ఆదరణ మాత్రం తగ్గ డం లేదు. బహుశా అం దుకేనేమో బంగారం విలు వ పెరగడమే కానీ తగ్గడం అంటూ లేదు. మహిళలకు బంగారం పట్ల మక్కు వ ఎక్కువ.

కనీసం ఒక్క బంగారు నగ అయినా ఉండాలని కోరుకునేవారు ఎంతోమంది ఉం టారు. అయితే ఆనాటి కాలంలో శ్రీమంతుల ఇంట్లో మహిళలకు ఏడు వారాల నగలుండేవి. ఇంట్లో మహిళలందరికీ ఏడు వారాల నగలుండడం ప్రతిష్ఠగా భావించేవారు. ముఖ్యంగా వివాహ సమయంలో వధువుకు ఏడువారాల నగలు పుట్టింటి వారు కానీ, అత్తింటి వారు కానీ పెట్టడం ఆనవా యితీగా ఉండేది. అయితే ఇప్పటికీ ఆ పద్ధతి కొన్ని చోట్లా కొనసాగుతోంది. 

పురాతన పెట్రోల్ పంపును చూశారా?

తెలంగాణలో అనేక చారిత్రక కట్టడా లు, ఔరా అనిపించే వస్తువులెన్నో ఉన్నా యి. ఆనాడు వారు వాడిన వస్తువులు నేటికీ మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వీటిని చూసినప్పుడుల్లా ఆనాటి జీవన విధానాలు, సాంఘిక పరిస్థితులు గుర్తుకువస్తాయి.

ఆరోజుల్లో వాడిన వాహనా లే గమ్మత్తుగా ఉంటే.. పెట్రోల్ పంపులు కూడా విచిత్రంగా ఉండేవి. ప్రస్తుతం మనం చూసే పంపుల్లో రీడింగ్ ఉంటే.. ఆకాలంలో పంపుల్లోని గడియారం లాంటి రీడింగ్ ఉండేది. వాటిలో ముల్లులను కూడా చూడొచ్చు. ఇలాంటి పురా తన పెట్రోల్ పంపుల ఆనవాళ్లు ఇప్పటికీ కొన్ని చోట్లా ఉన్నాయి. నిజాం నవాబుల స్థలాల్లో, పురాతన కట్టడాల దగ్గర ఆనాటి పెట్రోల్ పంపులు నేటికీ దర్శనమిస్తున్నాయి.