calender_icon.png 4 January, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీపి జ్ఞాపకాలు

30-12-2024 12:00:00 AM

గంగాళం వాడారా..?

ఆనాటి వస్తువుల్లో గంగాళం ఒకటి. ఇది విభిన్నంగా ఉంటుంది. ఇత్తడి తో కూడిన పాత్ర. పైభా గం తెరచి, ఆడుగు భాగం కొంచెం ఉబ్బెత్తుగా ఉం టుంది. నీళ్ళను నిలువ ఉంచడానికి ఉపయోగిస్తారు. ఇందులో నాలుగై దు బిందెల నీళ్లు నిల్వ చేసుకోవచ్చు. ఆ రోజుల్లో చాలామంది ఇండ్లలో గంగాళం దర్శనమిచ్చేది.

ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే.. ముందుగా గంగాళం దగ్గరకు వెళ్లి కాళ్లు కడుగుకొని ఇంట్లో అడుగుపెట్టేవారు. దీని ఆకారమే కాదు.. బరువు కూడా ఎక్కువే. తెలంగాణలోని కొన్ని పల్లెలు ఇప్పటికీ గంగాళం వాడుతుండటం విశేషం. 

భలే కొమ్ము చెంబు

ఈ చెంబు భలే గమ్మత్తుగా ఉంటుంది. చూసేందుకు చెంబు మాదిరిగానే ఉం టుంది. కాకపోతే చెంబు చివరన ఓ కొమ్ము తగిలించి ఉంటుంది. అందుకే దీనిని ‘కొమ్ము చెంబు’ లేదా ‘కొంబు చెంబు’ అంటారు. దీనికున్న కొమ్ముకు చివర ఒక పాల తిత్తెను తగిలించి, దానికోచిల్లు పొడిచి ఉంటుంది.

ఆ రోజుల్లో పిల్లలకి పాలు పట్టించేవారు. రాగితో తయారయ్యే ఈ చెంబు అప్పట్లో ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంది. అయితే నేటికీ కొన్ని చోట్లా ఇలాంటి రకం చెంబులను వాడుతున్నవారు ఉన్నారు.