టార్చిలైట్ వాడారా?
ఆరోజుల్లో చాలామంది చేతుల్లో కనిపించే వస్తువుల్లో టార్చిలైట్ ఒకటి. రెండు లేదా మూడు పెద్ద పెద్ద సెల్స్‌తో పనిచేసే ఈటార్చ్ ఆన్ చేయగానే వెలుగులను విరజిమ్మేది. రాత్రి పూట ఏదైనా వెతకడానికి.. రోడ్డు మీద నడవటానికి ఉపయోగపడేది. మొదట్లో డబ్బున్నవాళ్లు మాత్రమే వినియోగిం చేవాళ్లు.
ఆ తర్వాత మధ్యతరగతి ప్రజలు, రైతులూ వాడటం మొదలుపెట్టారు. ఆ రోజుల్లో రాత్రి టైంలో ఏవైనా పనులు చక్కబెట్టుకోవాలంటే టార్చిలైట్ అవసరం కచ్చితంగా ఉండేది. అయితే ఇప్పటికీ కరెంటు సౌకర్యం లేని కొన్ని గ్రామాల్లో టార్చిలైట్లు వాడుతుండటం విశేషం.
సంగీతానికి చిరునామా
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్, ఐపాడ్స్‌లో పాటలు వింటున్నాం. ఎన్నో మ్యూజిక్ యాప్స్ అందుబాటులో ఉంటుండటంతో క్షణాల్లో ఇష్టమైన పాటలు వింటూ మైమరిపోతున్నాం. కానీ ఒకప్పుడు ఈ టేప్ రికార్డరే సంగీతానికి చిరునామాగా ఉండేది. ఇష్టమైన పాటలు వినాలంటే క్యాసెట్లు కొని అందులో ప్లే చేసుకునేవాళ్లం. అప్పట్లో ఇదొక లగ్జరీగా ఉండేది. ప్రస్తుతం టేప్ రికార్డర్ నోస్టాల్జియాగా మిగిలిపోయింది.