calender_icon.png 28 October, 2024 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తీపి జ్ఞాపకాలు

28-10-2024 12:00:00 AM

పెట్రోమ్యాక్స్ లైట్లను చూశారా..

ఆరోజుల్లో కరెంటు లేకపోతే బుడ్దీ దీపాలు, కిరోసిన్ లాంతర్లను వాడేవారు. చిన్న దీపాలు మాత్రం ఇంటి వరకు పరిమితమవుతూ వెలుగులను అందించేవి. అయితే శుభాకార్యలు, ఇతర వేడుకల్లో బుడ్దీ దీపాలకు మించి వెలుతురు అవసరం ఉండేది. అందుకే పెట్రోమ్యాక్స్ లైట్లు వాడుకలోకి వచ్చాయి. కరెంటు లేని సమయంలో అప్పటివాళ్లు ఈ లైట్లను ఎక్కువగా వాడారు.

కిరోసిన్‌తో పని చేసే పెట్రోమాక్స్‌లోని ఫ్లఫ్ ట్యూబ్ లైట్ మాదిరిగా వెలుగులు విరచిమ్మడం చాలా ఆశ్చర్యకరంగా ఉండేది. అప్పట్లో ఇది హైమాస్ట్ లైట్ల మాదిరిగా పనిచేసేవి. కొంతమంది ఈ లైట్లను శుభకార్యాలకు ఇస్తూ ఆర్థికంగా సొమ్ము చేసుకునేవారు కూడా. అయితే ఆ తర్వాత విద్యుత్ వాడకం పెరగడంతో ఈ లైట్లు అటకెక్కి కనుమరుగయ్యాయి. 

కత్తిపీటను వాడారా..

ఆనాటి వస్తువుల్లో కత్త్తిపీట ఒకటి. ఆరోజుల్లో ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా కనిపించేది. కత్తిపీట అంటే ఒక కర్రతో చేసిన పీట మీద బిగించి ఉంచే పరికరంలాంటిది. దీన్ని ఉపయోగించి కూరగాయలు, పండ్లు మొదలైనవి కోసేవారు. ఇందులోని కత్తి వక్రంగా ఉంటుంది.

ఏదైనా కోయడానికి రెండు చేతులనుపయోగించి కత్తి అందున ఉంచి బ్లేడుకు వ్యతిరేకంగా బలాన్ని ఉపయోగిస్తారు. అయితే కాలక్రమేణా వీటి స్థానంలో చాకులు, కట్టర్లు వచ్చిచేరాయి. తెలంగాణలో కొన్నిచోట్లా నేటికీ గ్రామీణ మహిళలు ఈ కత్తిపీటను వాడుతుండటం విశేషం.