calender_icon.png 19 April, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బియ్యం పిండితో.. తీపి వంటలు

13-04-2025 12:23:38 AM

బియ్యం పిండితో రకరకాల వంటకాలు చేస్తారనే విషయం తెలిసిందే. అయితే అవి కూడా ఎప్పుడూ చేసుకునేవి కాకుండా కాస్త కొత్తగా, వెరైటీగా ట్రై చేస్తే బాగుంటుంది కదా! అరిసెలు.. టిఫిన్స్ మాత్రమే కాకుండా... బియ్యం పిండితో చేసే వెరైటీ స్వీట్లపై ఓ కన్నేద్దామా..  

స్టీమ్డ్ స్వీట్

ఇట్ల చేద్దాం..

పాన్‌లో పాలు వేడిచేశాక అందులో చక్కెర వేసి కలపాలి. తర్వాత బియ్యం పిండి వేసి మిశ్రమం దగ్గరపడేవరకు బాగా కలపాలి. ముద్దగా అయ్యాక కొంచెం పిండి తీసుకుని సన్నగా, పొడవుగా తాడులా చేయాలి. ఆపై దాన్ని గుండ్రంగా చుట్టాలి. వీటిని కొబ్బరి పొడిలో దొర్లించాలి. తర్వాత ఇడ్లీలా ఉడికించాలి. అందులో ఇడ్లీ పాత్రలో నీళ్లు వేడి చేయాలి. ఇడ్లీ ప్లేట్లకి నూనె పూసి తయారుచేసిన వాటిని పెట్టాలి. ఆవిరి మీద పది నిమిషాలు ఉడికిస్తే.. టేస్టీగా ఉండే స్టీమ్డ్ స్వీట్ రెడీ. 

షిర్మాలే

ఇట్ల చేద్దాం..

కొబ్బరి పాలలో బెల్లం, జిలకర్ర పొడి, కుంకుమ పువ్వు సిరప్, యాలకుల పొడి, ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. ఒక పాన్‌లో నీళ్లు కాగబెట్టాలి. అవి మరిగాక అందులో నెయ్యి, చిటికెడు ఉప్పు, బియ్యం పిండి వేసి కలపాలి. మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించి కాసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత పిండిని ముద్దగా కలపాలి. అందులో కొంచెం పిండి తీసుకుని నూనె నూనె పూసి చక్రాల్లా వత్తాలి.

వాటిని ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించాలి. అందుకోసం ఇడ్లీ ప్లేట్‌లో నూనె పూసిన అరిటాకు వేసిదాని మీద వీటిని పెట్టాలి. మూతపెట్టి ఐదు నిమిషాలు ఉడికించాక వాటిని ఒక చిన్న ప్లేట్ లేదా కప్‌లో వేసి.. రెడీ చేసిన బెల్లం మిశ్రమాన్ని పోఆయలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే మరాఠీ షిర్వాలే స్వీట్ రెడీ.

పుటాంగ్ బిగాస్

ఇట్ల చేద్దాం..

గిన్నెలో బియ్యం పిండి, చక్కెర, బేకింగ్ పౌడర్, ఉప్పు కలపాలి. అందులో పాలు, నీళ్లు, వెనీలా ఎసెన్స్ వేసి ఈ మిశ్రమం మృదువుగా అయ్యేవరకు కలపాలి. గిన్నెమీద మూతపెట్టి పావుగంటసేపు పక్కన పెట్టాలి. అరిటాకులను అచ్చుల్లా తయారుచేసి అందులో ఈ మిశ్రమం పోయాలి. వీటిని పావుగంట పాటు ఆవిరి మీద ఉడికించాలి. చల్లారాక తింటే టేస్టీగా ఉంటాయి పుటాంగ్ బిగాస్. 

రైస్ బర్ఫీ

ఇట్ల చేద్దాం..

పాన్‌లో నెయ్యి వేడి చేసి బియ్యాన్ని రంగు మారేవరకు వేగించాలి. అవి చల్లారాక మిక్సీజార్‌లో వేగించిన బియ్యంతో పాటు బాదం, జీడిపప్పులు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి. మరో పాన్‌లో నీళ్లు పోసి, చక్కెర కరిగించాలి. పాకం చిక్కబడ్డాక పాలు పోసి బాగా కలపాలి.

ఆ రెండూ బాగా కలిపిపోయాక బియ్యం పిండి మిశ్రమం వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. కొంచెం నెయ్యి వేసి కాసేపటివరకు కలపాలి. నెయ్యి పూసిన గిన్నెలో తయారైన మిశ్రమాన్ని వేసి సమంగా పరవాలి. అది చల్లారాక గిన్నెను బోర్లించి, చాకుతో ముక్కలుగా కట్ చేయాలి.