పాల్గొన్న ఎమ్మెల్యే పాయం, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరి..
మణుగూరు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాకతీయులు నిర్మించిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్ కూచిపూడి వెంకటేశ్వరరావు (బాబు) లతో పాటు కమిటీ సభ్యులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(MLA Payam Venkateshwarlu), డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్యలు చైర్మన్ కూచిపూడి బాబుతో పాటు కమిటీ సభ్యులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడారు. నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులందరూ నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయానికి మెరుగైన సేవలు అందించాలని.. ఆలయ అభివృద్ధి కొరకు పాటుపడాలని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం EO సుదర్శన్, డివిజన్ ఇన్ స్పెక్టర్ P బేవ్ సింగ్, అర్చకులు రామచంద్ర మూర్తి, నూతన కమిటీ సభ్యులు గోపయ్య, సత్యనారాయణ, రవి, శ్యామల, పద్మ, నాగమణి, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్, మాజీ వైస్ ఎంపీపీ కేవీ రావు, మాజీ ఉపసర్పంచ్ పుచ్చకాయల శంకర్, సామ శ్రీనివాస్ రెడ్డి, అశ్వాపురం నాయకులు ముత్తినేని వాసు, ఆర్ కే, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.