మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): నాటి నుంచి నేటి వరకు మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డుకు ప్రత్యేక విశిష్టత ఉంది. ఈ మార్కెట్ యార్డుకు మహబూబ్‌నగర్ జిల్లానే కాదు, ఇతర జిల్లాల నుంచి కూడా రైతులు తాము పండించిన పంటను తీసుకుంటారు. ఇంత పెద్ద మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం బాధ్యతల స్వీకరణ కార్యక్రమం శనివారం అత్యసవసరంగా జరిగింది. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో మార్కెట్ కమిటీ చైర్మన్‌గా బెక్కరి అనిత, వైస్ చైర్మన్‌గా పెద్ద విజయకుమార్, డైరెక్టర్లు సంతకాలు చేసి భాద్యతలు స్వీకరించారు.