- మూలవరులకు అష్టోత్తర శతఘటాభిషేకం
- గిరి ప్రదక్షిణకు వేలాదిగా తరలొచ్చిన భక్తులు
- విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం.. అఖంఢ దీపారాధన
యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణకు అవ తరించిన నృసింహుడి తిరు నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని ఆదివారం యాదాద్రి ఆలయ సన్నిధిలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. వేలాది మంది భక్తులతో కలిసి ప్రదక్షిణ చేశారు. ప్రధానాలయంలో మూలవరులకు హోమ పూజలు, అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు. విష్ణు పుష్కరిణిలో స్నాన సంకల్పం, అఖండ దీపారాధన చేశారు.