calender_icon.png 6 January, 2025 | 10:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వాతిరెడ్డి వచ్చేసింది..

29-12-2024 12:00:00 AM

2023లో విడుదలైన ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం రూపొందుతోంది. తొలి భాగం మంచి సక్సెస్ సాధించడంతో రెండవ భాగంపై అంచనాలు బాగానే ఉన్నాయి. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘మ్యాడ్ స్కేర్’ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్‌ల త్రయం సిద్ధమవుతోంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా ‘మ్యాడ్’ విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. దీంతో ‘మ్యాడ్ స్క్వేర్’ పాటలపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ఉంది. ‘లడ్డు గాని పెళ్లి’ అంటూ ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి గీతానికి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ‘స్వాతి రెడ్డి’ అంటూ సాగే రెండో పాటను మేకర్స్ శనివారం విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం అందించడమే కాకుండా, స్వాతిరెడ్డితో కలిసి ఈ పాటను భీమ్స్ ఆలపించారు.

ఈ పాటకు సురేశ్ గంగుల సాహిత్యం అందించారు. ఈ పాటలో రెబా మోనికా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.