calender_icon.png 16 March, 2025 | 8:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీజీహెచ్‌లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర

16-03-2025 01:20:52 AM

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాం తి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర  స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌ఎస్వీవీ రమ ణ తెలిపారు. ప్రతినెల మూడో శనివారం జీజీహెచ్‌లో జరిగిన స్వర్ణాంధ్ర  స్వచ్ఛ ఆం ధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్లాస్టిక్ దుష్ప్రభావం వల్ల నేల, నీరు, సముద్రజలాలు సైతం కలుషితమవుతున్నాయని తెలిపారు. ఆహారంపై కూడా దీని ప్రభావం పడటం వల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తున్నాయన్నారు.

ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి, పర్యావరణాన్ని కాపా డటం మన బాధ్యత అని పేర్కొన్నారు. అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ రాబోయే తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని తెలిపారు. అనంతరం ఆస్పత్రి సిబ్బందితో ర్యాలి నిర్వహించి, ఆసుపత్రిలో ఉన్న రోగులకు ప్లాస్టిక్ ద్వారా వచ్చే నష్టాలను వివ రించారు. కార్యక్రమంలో ఆరో డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉప్పాల శ్రీనివా స్, సీఎస్‌ఆర్‌ఎమ్‌వో అడ్మినిస్ట్రేటర్ తదితరులు పాల్గొన్నారు.