23-02-2025 12:00:00 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి) : స్వర్ణగిరి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భీమవరం గోవింద పీఠం పీఠాధిపతి త్రిదండి రామచంద్ర రామానుజ జీయర్‌స్వామి శనివారం ఉత్సవాలకు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మంగళశాసనాలను అనుగ్రహించారు. స్వర్ణగిరి వెంకటేశ్వరస్వామికి సింహాచలం వరాహ నరసింహస్వామి పట్టు వస్త్రాలను, శేషమూల చందనాన్ని సమర్పించారు. ఆలయంలో జరిగిన ఆయా కార్యక్రమాల్లో దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు దంపతులు పాల్గొన్నారు.