కామారెడ్డి (విజయక్రాంతి): భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చూపిన మార్గదర్శి స్వామి వివేకానంద అని సేవా సంఘం ప్రెండ్స్ యూత్, నెహ్రూ యువ కేంద్ర సభ్యులు అన్నారు. ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్బంగా యూత్ ఐకాన్, యువత ప్రేరణ మూర్తి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చూపిన మార్గదర్శ, మహా జ్ఞాని స్వామి వివేకానం జయంతి, జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఆసుపత్రిలోని రోగులకు డాక్టర్ రఘుతేజ జనరల్ సర్జన్ చేతుల మీదుగా పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ, యువ కేంద్ర మాజీ వాలంటీర్ సునీల్ రాథోడ్ మాట్లాడుతూ.. కేవలం 39 సంవత్సరాల జీవితకాలంలోనే ఎన్నో వందలాది పుస్తకాలను రచించి రామకృష్ణ మఠాన్ని స్థాపించి ఆయన చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1948లో ఆయన జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించాలని ఆదేశాలను జారీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టాప్ నర్స్ కవిత, జైల్‌సింగ్, లాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.