- పటాన్‌చెరులో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
చిట్కుల్‌లో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నీలం మధు నివాళులు
పటాన్‌చెరు, జనవరి 12 : యువతకు ఆదర్శప్రాయుడైన స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలను ఆదివారం పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. పటాన్ చెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పూలమా లవేసి నివాళులు అర్పించారు. చిట్కుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న వివేకానంద విగ్రహానికి నీలం మధు పూల మాలవేసి నివాళులు అర్పించారు..
అలాగే పటాన్ చెరు, రామచంద్రాపురం, అమీన్ పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలా లు, తెల్లాపూర్, బొల్లారం మున్సిపల్ పరిధిలో వివేకానంద జయంతి ఉత్సవాల ను నాయకులు, యువజన సంఘాల యువకులు నిర్వహించారు. పూలమాల లు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పటాన్‌చెరు కార్పొరేటర్ కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసిం హారెడ్డి, అఫ్జల్, అశోక్, వెంకటేష్, యువజ న సంఘాల నాయకులు పాల్గొన్నారు.
యువతకు స్ఫూర్తిదాయకం ః ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్, జనవరి 12 : నేటి యు వతకు వివేకానందుడు ఎంతో స్ఫూర్తిదా యకమని ఎమ్మెల్యే పి.సంజీవరెడ్డి అన్నారు ఆదివారం వివేకానంద జయంతి సంద ర్భంగా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో గల ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ సెట్, కౌన్సిలర్లు వివేకానంద, రాజేష్, రామ కృష్ణ, మాజీధ్, నరసింహులు, మనూరు మండలం యూత్ కాంగ్రెస్ నాయకులు ఆకాశరావు, చంద్రశేఖర్ ఆచారి, మధు సూదన్ రెడ్డి, బాణాపురం రాజు, తదితరు లు పాల్గొన్నారు. నియోజకవర్గం లోని మనూరు, కంగ్టి, సిర్గాపూర్, కలేర్, నిజాం పేట్, నాగలిగిద్ద తదితర మండలంలో ఆయా గ్రామాల్లోని యువకులు వివేకానం దుని చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి ఘనంగా నిర్వహించారు.
వివేకానందుడు ప్రసిద్ధిగాంచిన యోగి మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జనవరి 12 (విజయక్రాంతి) : స్వామి వివేకానందుడు ప్రసిద్ధి గాంచిన హిందూ యోగి అని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ హాల్లో యువజన క్రీడల నిర్వహ ణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారి జన్మదినం సందర్భంగా అధికారులు మరియు జిల్లా యువజన నాయకులతో జిల్లా కలెక్టర్ పాల్గొని స్వామి వివేకానంద చిత్రపటానికి పూల మాల వేసి అందరికీ శుభాకంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యువజన క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు పాల్గొన్నారు.