ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్
జగిత్యాల అర్బన్, జనవరి 22 (విజయ క్రాంతి): స్వామి వివేకానంద నేటి యువతకు ఆదర్శమని ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్’కుమార్ పిలుపునిచ్చారు. జగిత్యాల వివేకానంద మినీ స్టేడియంలో ఏర్పాటుచేసిన స్వామి వివేకానంద విగ్ర హాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడవాల జ్యోతి లక్ష్మణ్‌లు బుధవారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వివేకనంద క్రీడా మైదానంలో వివేకానం దుని నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించు కోవడం ఆనందదాయకమన్నారు. మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేసు కొని వారిని స్మరించుకోవడమే కాకుండా వారి ఆశయాలను ఆదర్శాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని, వివేకానంద స్వామి రచనలను నేటి విద్యార్థులు చదివి ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు.
మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ మునిసిపల్ ఆధ్వ ర్యంలో వివేకానందుని విగ్రహాన్ని ఏర్పాటు చేయడం తనకు ఆనందంగా ఉందన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను విదేశాలలో చాటి చెప్పిన మహనీయుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వివేకానంద ఉత్సవ సమితి కన్వీనర్ మ్యాన మహేష్ మాట్లాడుతూ వివేకనంద ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గతంలో వివేకానంద 150 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.
ఆ ఉత్సవాల స్ఫూర్తితో స్వామి వివేకనంద విగ్రహాన్ని జగిత్యాల పట్టణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగిందని దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సహకారంతో వివేకానంద మినీ స్టేడియంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకు న్నామని తెలిపారు. సనాతన ధర్మసారధి, యువకుల ఆశాజ్యోతి వివేకనం దుని ఆశయ ఆదర్శాలకనుగుణంగా యువత ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఈ క్రీడా మైదానంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు.
స్వామి వివేకానంద ఆకాంక్షలకు అనుగుణంగా నేటి యువత మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు నలువైపులా చాటి చెప్పాలని ఆకాం క్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్ చుక్క నవీన్, జిల్లా యువజన, క్రీడల అధికారి రవికుమార్, డిఈ నాగేశ్వర్, కౌన్సిలర్లు జుంబర్తి రాజ్ కుమార్, గుర్రం రాము, దాసరి లావణ్య, పద్మావతి పవన్, బొడ్ల జగదీష్, నాయకులు చెట్పల్లి సుధాకర్, కొమురవెల్లి లక్ష్మి నారాయణ, టివి సూర్యం, నరేందర్ రావు, రామకృష్ణ, ఏసీఎస్ రాజు తదితరులు పాల్గొన్నారు.