calender_icon.png 12 January, 2025 | 3:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథనిలో ఘనంగా స్వామి వివేకానంద 162వ జయంతి వేడుకలు

12-01-2025 12:05:32 PM

మంథని,(విజయక్రాంతి): మంథని పట్టణంలోని స్వామి వివేకానంద 162 వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం మంథని పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా గల స్వామి వివేకానంద  విగ్రహానికి పూలమాల వేసి ప్రజా ప్రతినిధులు,  మేధావులు, విద్యార్థి నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకుడు డిగంబర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని, ఆయన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. హిందూ మతం యొక్క గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి అని, ఆయన మరణించినా కూడా ఇప్పటికీ కూడా ఆయన భావాలు ఆయన ఆలోచనలు మన అందర్నీ మేలుకొలుపుతాయన్నారు. 

స్వామి వివేకానంద  విగ్రహాన్ని మంథనిలో  నేను ఏర్పాటు చేయటం నా పూర్వజన్మ సుకృతం

స్వామి వివేకానంద  విగ్రహాన్ని మంథనిలో  తాను ఏర్పాటు చేయటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని విద్యార్థి నాయకుడు డిగంబరం అన్నారు. ఆయన పుట్టినటువంటి భారతదేశంలో నేను కూడా పుట్టడం చాలా గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది రగోతం రెడ్డి, సీనియర్ సిటిజన్ బుచ్చన్న గౌడ్, ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ బోగోజు శ్రీనివాస్, కనుకుంట్ల స్వామి, సబ్బని సంతోష్, హర్షవర్ధన్, సంతోష్, అజయ్, అరవింద్, సాయి, నీ లక్షిత్, విశాల్, లిఖిత్, విష్ణు, సూర్య, మని, చరణ్, తదితరులు పాల్గొన్నారు.