గ్రామ వీధుల్లో స్వామివారి గ్రామ పర్యటన
భీమదేవరపల్లి,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో పల్లకిలో స్వామి గ్రామ పర్యటన ఆద్యంతం కన్నుల పండువగా జరిగింది. భక్తులు స్వామి వారి గ్రామ పర్యటనలో వారి గడపమందుకు రాగానే కొబ్బరికాయలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. స్వామి వారి ఆలయంలో వేకువజామున ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పర్యటనలో కొత్తకొండ ఆలయ చైర్మన్ కొమురవెళ్లి చంద్రశేఖర్‌గుప్తా, ఈవో కిషన్‌రావు, సీఐ పులి రమేశ్, ఎస్సై సాయిబాబు, డైరెక్టర్ కొంగొండ సమ్మయ్య, ఆలయ అర్చకులు కంచనపల్లి రాజయ్య, మొగిలి పాలెం రాంబాబు, తాటికొండ వినయ్ శర్మ, నందనం సందీప్, జానకిపురం రవిశర్మ, ఆలయ సిబ్బంది రాజు తదితరులు పాల్గొన్నారు.