- సహకార బ్యాంకుల్లో రాజ్యమేలుతున్న అవినీతి
- సిబ్బందితోపాటు పాలకవర్గం భాగస్వామ్యం!
- రెబ్బెన, బెజ్జుర్ పీఏసీఎస్‌లో కొనసాగుతున్న విచారణ
- ఇప్పటికే పలువురు సిబ్బందిపై వేటు
కుమ్రంభీ ఆసిఫాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లా లోని ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యం లో కొనసాగుతున్న బ్యాంకుల్లో అవినితి, అక్రమాలు రాజ్యమేలుతున్నట్లు ఆరోపణలున్నాయి. రైతులు ఇచ్చిన రుణాల చెల్లింపుల్లో సిబ్బంది చేతివాటం చూపించడంతో పలువురుపై వేటు పడింది.
బెజ్జూర్, దహెగాం, రెబ్బెన సహకార బ్యాంకుల్లో అవినీతి జరిగినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలున్న నేపథ్యం లో సంబంధిత అధికారులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం బెజ్జుర్, రెబ్బెన పీఏసీఎ స్‌లలో అక్రమాలపై ప్రత్యేక అధికారి అనంత లక్ష్మి విచారణ చేపడుతున్నారు.
రూ.లక్షల్లో అవినీతి
రెబ్బెన మండల సహకార సంఘంలో రూ.60 లక్షలకు పైగా అవినీతి జరిగిందని రైతులతో పాటు ప్రజా సంఘాల నాయకు లు అందోళన చేపట్టారు. దీంతో ఆగస్టు 21న సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న సంతోష్‌ను సస్పెండ్ చేశారు. సహకార సంఘం లావాదేవీలతో పాటు ఎరువులు, విత్తనాల విక్రయాలపై విచారణ కొనసాగుతున్నది. దహెగాం సహకార సంఘంలోనూ అక్రమాలు బయపడ్డాయి.
అధికారులు, కింది స్థాయి సిబ్బంది రూ.45 లక్షల పక్కదారి పట్టించారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో లావాదేవీలు కొనసాగేవి. మూడేళ్ల క్రితం ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి రావడం తో అక్రమాల దందా వెలుగు చూస్తుంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో కార్యదర్శి బక్కయ్యను అధికారులు సస్పెండ్ చేశారు.
ఎరువులు, విత్తనాల పంపిణీలో..
సహకార సంఘాలలో రైతులకు మార్క్‌ఫెడ్ ద్వారా విత్తనాలు, ఎరువులు పంపిణీ చేస్తారు. ఇందులో వరి, కందులు, శనగలు, సోయాబీన్‌తో పాటు యూరియా, డీఏపీ, కంపోస్ట్ ఎరువులను సబ్సిడీపై అందజేస్తారు. వీటి పంపిణీలోనూ అక్రమాలు జరిగి నట్లు ఆరోపణలున్నాయి. అయితే రైతుల అందోళన నేపథ్యంలో సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తూ చేతులు దులుపుకుం టున్నారనే విమర్శలు సైతం లేకపోలేదు.
సహకార సంఘాల్లో కోట్ల రూపాయల అవినీతి జరుగుతుందని ప్రజా సంఘాల నాయ కులు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు వచ్చిన పీఏసీఎస్‌లే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాథమిక సహకార సంఘాల్లో విచారణ చేపడితే అక్రమాలు బయట పడుతాయని వారు పేర్కొంటున్నారు.
బినామీ పేర్లతో రుణాలు
జిల్లాలోని కొన్ని ప్రాథమిక సహకార సంఘాల్లో బినామీ రైతుల పేర్లతో పాలక వర్గంలోని కొందరు వ్యక్తులు రుణాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. అమాయ క రైతుల నుంచి పట్టా, పాసు పుస్తకాలను తీసుకుని వారికి తెలియకుండా వారి పేరు మీద రుణాలు తీసుకున్నట్లు తెలుస్తున్నది. సదరు రైతులపై తీసుకున్న రుణాలను ప్రభుత్వాలు చేసిన రుణమాఫీలోనూ అక్రమార్కు లు లబ్ధిపొందుతున్నట్లు తెలుస్తున్నది.
రుణాల చెల్లింపుల్లో చేతివాటం
బెజ్జుర్ పీఏసీఎస్‌లో ప్రాథమిక విచారణ నివేదిక అధారంగా సిబ్బంది వెంక టేష్‌గౌడ్, సంజీవ్, మహేష్‌లను సస్పెండ్ చేస్తూ జిల్లా అధికారి రాథోడ్ బిక్కు నాయ క్ ఉత్తర్వులు జారీ చేశారు. దాదాపు 1,800 మంది రైతులకు సంబంధించిన రుణాల చెల్లింపుల్లో అక్కడి సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. రైతు రుణమాఫీ లోనూ అవకతవకలు జరిగినట్లు విమర్శలున్నాయి.
గతంలోనూ పెద్ద ఎత్తున నిధు లు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పీఏసీఎస్ చైర్మన్ హర్షద్ హుస్సేన్‌తో పాటు సిబ్బంది వెంకటేశ్వర్‌గౌడ్, సత్యనారాయణగౌడ్‌పై అధికారు లు నిధుల రికవరీకి చర్యలు తీసుకోవడంతో వారు కోర్టును ఆశ్రయించారు. దీంతో రూ. 48.69 లక్షల రికవరీ అక్కడే ఆగిపోయింది.
2023-24 సంవత్సరంలో వెంకటేష్‌గౌడ్, సంజీవ్ రైతుల రుణమాఫీ, రుణాల చెల్లింపుల్లో అవినీతికి పాల్పడ్డారని రైతులు అం దోళన చేశారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు సైతం వారికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డీసీ వో ఆధ్వర్యంలో విచారణ చేపట్టి, ప్రాథమిక నివేదిక ఆధారంగా ఇద్దరిని సస్పెండ్ చేశారు.
విజిలెన్స్, ఏసీబీ ద్వారా విచారణ చేపట్టాలి
జిల్లాలోని అన్ని పీఏసీఎస్‌లలో అవీనితి, అక్రమాలపై విజిలేన్స్, ఏసీబీ అధికారులతో విచారణ చేపడితే సిబ్బం ది బాగోతం బయట పడుతుంది. ఏటా ఆడిట్ చేస్తున్నప్పటికీ అక్రమలు జరుగుతున్నాయి. అవినీతి, అక్రమాలలో అధికా రులు, సిబ్బంది వాటా ఉంది. ఉన్నతాధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.
బోగే ఉపేందర్,
ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి
విచారణ చేపడుతున్నాం
జిల్లాలోని బెజ్జూర్, రెబ్బెన సహకార సంఘాల్లో అవీనితి, అక్రమాలు జరిగినట్లుగా వచ్చిన ఆరోపణల నేపథ్యం లో విచారణ చేపడుతున్నాం. ప్రతి రైతు వివరాలను సేకరిస్తున్నాం. రుణాలు, రుణమాఫీ వివరాలను పరిశీలిస్తున్నాం. ప్రాథమిక విచారణ అనంతరం రెబ్బెన, బెజ్జూర్‌లో నలుగురిని సస్పెండ్ చేశాం. గతంలోనే దహెగం కార్యదర్శిని విధుల నుంచి తొలగించాం. అవీనితికి పాల్పడిన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
రాథోడ్ బిక్కు నాయక్,
డీసీవో, ఆసిఫాబాద్