calender_icon.png 3 February, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెచ్చిపోవాలే..

02-02-2025 10:23:06 PM

హ్యాట్రిక్ హిట్ల తర్వాత ప్రస్తుతం ఓ సున్నితమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్. ‘బ్రహ్మా ఆనందం’ అనే టైటిల్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో బ్రహ్మానందం, అతని కుమారుడు రాజాగౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సావిత్రి, ఉమేశ్‌కుమార్ సమర్పణలో నూతన దర్శకుడు ఆర్‌వీఎస్ నిఖిల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, సంపత్‌రాజ్, రఘుబాబు, ప్రభాకర్, డివిజ ప్రభాకర్, దయానంద్‌రెడ్డి తదితరులు వివిధ పాత్రల్లో నటించారు.

ఫిబ్రవరి 14న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న చిత్రబృందం ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, టీజర్, పాటలకు మంచి స్పందన దక్కింది. అదే జోష్‌లో తాజాగా ‘రెచ్చిపోవాలే’ అనే ఓ మాస్ నంబర్‌ను విడుదల చేశారు. గ్రామాల్లో జాతర సందడి ఎలా ఉంటుందో ఈ పాటలో చూపించారు. శాండిల్య పిసాపాటి బాణీ, శ్రీసాయికిరణ్ సాహిత్యం, సాకేత్ -శాండిల్య గాత్రంలో ఆకట్టుకుంటోందీ గీతం. ఈ పాటలో రాజాగౌతమ్ ఎనర్జిటిక్ స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మితేశ్ పర్వతనేని; ఎడిటర్: ప్రణీత్‌కుమార్; ఆర్ట్: క్రాంతి ప్రియం.