calender_icon.png 19 January, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛ్‌బయో సై

07-08-2024 02:31:19 AM

  • మొదటివిడుత పెట్టుబడిగా 1,000 కోట్లు
  • 2జీ బయో ఇథనాల్ ప్లాంట్ స్థాపించనున్న సంస్థ
  • 500 మంది తెలంగాణ యువతకు ఉపాధి కల్పన
  • హైదరాబాద్‌లో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్
  • తెలంగాణకు ఆర్సీసీఎం టెక్నాలజీ కంపెనీ
  • సీఎం రేవంత్‌రెడ్డితో కంపెనీల ప్రతినిధుల చర్చలు

హైదరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): లిగ్నోసెల్యూలోసిక్ బయో ఫ్యూయెల్స్ తయారీ సంస్థ స్వచ్ఛ్ బయో తెలంగాణలో రూ.1౦౦౦ కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. సుస్థిరమైన భవిష్యత్ కోసం ఎనర్జీ సొల్యూ షన్స్‌ను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి సారించింది.

ఇందులో భాగంగా 250 కేఎల్‌పీడీ సెకండ్ జనరేషన్ (2జీ) సెల్యూలోసిక్ బయో ఫ్యూయెల్ ప్లాంట్‌ను రాష్ట్రంలో స్థాపించనున్నది. మొదటి విడతలో రూ.1000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. తద్వారా 250 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. అదనపు సహకారంతోపాటు ఇతర అవసరాల కోసం మరో 250 మందికి కూడా ఉపాధి లభిస్తుంది.

సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి మంత్రి శ్రీధర్‌బాబు బృందం అమెరికాలో స్వచ్ఛ్ బయో చైర్‌పర్సన్ ప్రవీణ్ పరిపాటితో సమావేశమైంది. స్వచ్ఛ్ బయో అంతర్జాతీయ భాగస్వామి అయిన సుగనిట్ బయో రెన్యూవబుల్స్ సంస్థ బయోమాస్, సెల్యూలోజ్ నుంచి బయోఫ్యూయెల్స్, బయో కెమికల్స్ ఉత్పత్తి చేసే టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

సుస్థిరమైన, సానుకూల వృద్ధికోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ టెక్నాలజీ మరింత దోహదపడనున్నది. తెలంగాణలో స్వచ్ఛ్ బయో సంస్థ ఏర్పాటు చేయబోయే ప్లాంట్‌కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రవీణ్ పరిపాటి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్ర మాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధిలో భాగస్వామి కావడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్నామని తెలిపారు.

రాబోయే రోజుల్లో అద్భుతమైన వృద్ధికి ఇది దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణను బయో ఫ్యూయెల్స్ హబ్‌గా మార్చేందుకు భవిష్యత్‌లో మరిన్ని ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.  

హైదరాబాద్‌లో ట్రైజిన్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్

ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్‌లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంట ర్‌ను నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు సమావేశమై ఈ సెంటర్ ఏర్పాటుపై చర్చలు జరి పారు. ఈ కంపెనీ డాటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు ఇంటెలి జెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది.

హైదరాబాద్‌లో ట్రైజిన్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలి జెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. రాబోయే మూడేండ్లలో వెయ్యి మందికిపైగా ఉద్యోగులను నియమించుకుని శిక్షణనిస్తుంది. 160 మిలియన్ డాలర్లకుపైగా ఆదా యం ఉన్న ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 2500 మంది పనిచేస్తుండగా, అందులో వెయ్యి మంది మనదేశంలో ఉన్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు వంద మంది ఉన్నారు. మరో ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు ఈ కంపెనీ ప్రకటించింది. రెండు దశాబ్దాలుగా ఐక్యరాజ్య సమితితోపాటు అనుబంధ విభాగాలకు ఈ కంపెనీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది.

గత ఏడాది నుంచి ట్రైజిన్ కంపెనీ తమ సేవలు అందుకుంటున్న సంస్థ ల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతోపాటు ఫలితాలపై విశ్లేషణ చేస్తోంది. అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 

ఆర్సీసీఎం విస్తరణతో మరిన్ని ఉద్యోగాలు

టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్‌లో పేరొందిన ఆర్సీసీఎం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు బృందం ఆర్సీసీఎం సీఈవో గౌరవ్ సూరి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

ఆర్సీసీఎం మొదటిసారి హైదరాబాద్‌లో తమ ఆఫీసును ప్రారంభించను న్నది. ఈ సంస్థ అమెరికా వెలుపల పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. ప్రపంచవ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే రెండేళ్లలో హైదరాబాద్‌లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది.

డీఈ షా గ్రూప్, బ్లాక్‌స్టోన్ ఆల్టర్నేటివ్ సెంటర్ అసెట్ మేనేజ్‌మెంట్ మద్దతుతో ఆర్సీసీఎం స్వతంత్ర సంస్థగా ప్రారంభమైంది. బ్యాంకులు, హెడ్జ్ ఫండ్‌లు, సంస్థాగత ఆస్తుల నిర్వాహకులు, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలకు సంబంధించిన డాటాతోపాటు కార్యకలాపాలపై ఈ కంపెనీ విశ్లేషణలు అందిస్తుంది.

ప్రత్యేకంగా డాటా మేనేజ్‌మెంట్, డాటా స్ట్రాటజీలో ఈ కంపెనీకి గుర్తింపు ఉంది. మౌలిక సదుపా యాలతోపాటు నైపుణ్యమున్న మానవ వనరులుండటంతో హైదరాబాద్‌ను తమ అంతర్జాతీయ కార్యకలాపాలకు అనువైన ప్రదేశంగా ఎంచుకున్నట్టు కంపెనీ సీఈవో గౌరవ్ సూరీ తెలిపారు.

హెచ్‌సీఎల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్

హెల్త్‌కేర్‌లో పేరొందిన హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ సంస్థ హైదరాబాద్ లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పా టు చేయనుంది. ఈ ఏడాది మార్చి లో ఇంక్యుబేషన్ ఫెసిలిటీని ప్రారంభించిన ఈ సంస్థ తమ కార్యకలాపా లను మరింతగా విస్తరించనుంది. తెలంగాణలో ఏర్పాటు చేసే కొత్త క్యాంపస్‌కు నాలుగు లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుం ది.

అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్‌సీఎల్ ప్రతినిధులు కలిసి చర్చలు జరిపారు. ప్రభు త్వం తగిన మద్దతు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైదరాబాద్ లో హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ కార్యకలాపాలను విస్తరిస్తున్నందుకు సంతో షం వ్యక్తపరిచారు.

దీనివల్ల కొత్త ఉద్యోగాలు లభించటంతో పాటు తెలంగాణను ఆరోగ్య సంరక్షణ రం గంలో మరింత ముందుకు తీసుకు వెళ్తాయన్నారు. చర్చల సందర్భంగా హెచ్‌సీఎల్  సీనియర్ వైస్ ప్రెసిడెం ట్ ఎమిలీ డంకన్ మాట్లాడుతూ కొత్త ఆవిష్కరణల విషయంలో తమ విజన్‌కు అనుగుణంగా ఉన్న హైదరాబాద్‌లో హెల్త్ కేర్ సేవలను విస్తరిస్తున్నట్లు చెప్పారు.

ఈ గ్లోబల్ సెంటర్ త్వరలోనే పని ప్రారంభిస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడిం చారు. బ్రిటన్ తో పాటు ౨౦ దేశాల్లో పలు శస్త్రచికిత్స కేంద్రాలతోపాటు, అత్యవసర సంరక్షణ కేంద్రాలు, ఫిజీషియన్ క్లినిక్‌లతో దాదాపు 188 ఆసుపత్రులు, 2,400 ఆంబులేటరీ సైట్లను ఈ సంస్థ నిర్వహిస్తోంది.

ఐటీలో బహుముఖ వృద్ధి

ఐటీ రంగంలో బహుముఖ వృద్ధిని సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యనిస్తోంది. కంపెనీ విస్తరణకు ప్రభుత్వం తప్పకుండా సహకరిస్తుంది. ఈ కంపెనీ విస్తరణ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ రంగంలో హైదరాబాద్‌ను కొత్త ఆవిష్కరణ కేంద్రంగా నిలబెడుతుంది. 

 రేవంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి

ప్రభుత్వ, ప్రైవేట్ సహకారం తప్పనిసరి

సాంకేతిక వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల మధ్య సహకారం తప్పనిసరిగా ఉండాలి. ఆర్సీసీఎం లాంటి కంపెనీలకు తగినంత మద్దతుపాటు మౌలిక సదుపాయాలను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రపంచస్థాయి టెక్ కంపెనీలకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతుంది.

 శ్రీధర్‌బాబు, 

ఐటీశాఖ మంత్రి