calender_icon.png 16 January, 2025 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘స్వచ్ఛ్‌బయో’ సీఎం తమ్ముడిదే

08-08-2024 01:05:28 AM

రాష్ట్ర సంపదను సోదురునికి దోచిపెట్టే ఒప్పందాలా?

కంపెనీలు బోగస్ అని నిరూపించేందుకు సిద్ధం

బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి అమెరికా పర్యటన సందర్భంగా స్వచ్ఛ్‌బయో కంపెనీతో రూ.1,000 కోట్ల ఒప్పందం చేసుకోవడం ఒక డ్రామా అని, ఆ కంపె నీ ఆయన కుటుంబీకులకు చెందినదని బీఆర్‌ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ తెలిపారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తు తం నడుస్తున్నదే అసలైన కుటుంబపాలన అని విమర్శించారు. యూపీలో మెజ్జీ బార్ నిర్వహిస్తున్న వేదవల్లి శివానందరెడ్డి స్వచ్ఛ్ బయోలో ఒక డైరెక్టర్ కాగా, రెండో వ్యక్తి సీఎం సోదరుడు జగదీశ్వర్‌రెడ్డి అని చెప్పారు.

కానీ అమెరి కాలో సీఎంతో ఎంవోయూ కుదుర్చుకున్నప్పుడు హర్ష పసునూరి మాత్రమే ఉన్నారని, ఆయన జగదీశ్వర్‌రెడ్డి బినా మీ అని అన్నారు. స్వచ్ఛ్ బయో గత నెలలోనే ఏర్పాటైందని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలశాఖ లేఖ ద్వారా తేలిందన్నారు. ఆ కంపెనీకి రూ.1,000 కోట్లు డీల్ చేసే సీన్ లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రాష్ట్ర సంపదను తన సోదరులకు దోచిపెట్టే పనిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంతో సహా 30 మంది సభ్యుల ముఠా అమెరికా వెళ్లింది కుటుంబ వ్యాపారాలు పెంచడం కోసమేనా అని ప్రశ్నించారు. వాల్ష్ కర్రా అనే మరో డొల్ల కంపెనీతో రూ.839 కోట్ల ఒప్పం దం కుదుర్చుకున్నారని ఆరోపించారు. దీనిపై సీఎం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. డొల్ల కంపెనీలతో రేవంత్ ఒప్పందాలపై కోర్టులకెళతామ ని స్పష్టం చేశారు. ఇప్పుడు ఒప్పందం జరిగిన కంపెనీలు బోగస్ అని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామని సవా ల్ చేశారు.