calender_icon.png 20 September, 2024 | 2:26 PM

స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 నగరపాలక సంస్థకు మెరుగైన ర్యాంకుకు ప్రజలు సహకరించాలి

19-09-2024 05:35:03 PM

స్వచ్చ సర్వేక్షన్ 2024 నగరపాలక సంస్థకు మెరుగైన ర్యాంకుకు ప్రజలు సహాకరించాలి

ప్రతి ఒక్కరు భాగస్వాములై పరిసరాలను శుభ్రం చేసి తడి పొడి చెత్తను వేరు చేసి అందించాలి

కరీంనగర్,(విజయక్రాంతి): నగరపాలక సంస్థకు స్వచ్చ సర్వేక్షన్ లో మెరుగైన ర్యాంకు కోసం నగర ప్రజలు సహకారం అందించాలని కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ పిలుపు నిచ్చారు. 2024 స్వచ్చ్ సర్వేక్షన్ లో భాగంగా కరీంనగర్ లో గురువారం రోజు స్వచ్చతా హి సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 17,35,39 డివిజన్ లలో పర్యటించి పారిశుధ్య పనులను తనిఖీ చేసి పరిశీలించారు. నగరపాలక సంస్థ పారిశుధ్య విభాగం ఆద్వర్యంలో చేపట్టిన స్వచ్చతా ర్యాలీని ప్రారంభించి ర్యాలీలో పాల్గొన్నారు. మొదటగా సంబంధిత డివిజన్ లలో పారిశుధ్య పనులను తనిఖీ చేసి పరిశీలించారు. పారిశుధ్య కార్మీకుల హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేశారు.

అనంతరం 35 వ డివిజన్ పరిదిలోని సప్తగిరి కాలనీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. స్థానిక కార్పోరేటర్ చాడగొండ బుచ్చిరెడ్డితో కలిసి స్వచ్చతా హి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కను నాటి... స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన ఈ క్లాస్ రూంను తనిఖీ చేసి పరిశీలించారు. పాఠశాల విద్యార్థులను డిజిటల్ విద్యా విధానం పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్లాస్ రూం ద్వారా జరుగుతున్న బోధన విదానాన్ని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమావేశంలో పరిసరాల పరిశుభ్రత, తడి చెత్త పొడి చెత్త సెక్రిగేషన్, డ్రై వేస్ట్ రిసోర్స్ సెంటర్స్, వర్మికాంపోస్టు, స్వచ్చ్ సర్వేక్షన్ పరిక్ష తదితరులు అంశాలను విద్యార్థులకు వివరిస్తూ... అవగాహాన పరిచారు.

ఈ సందర్భంగా కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ... విద్యార్థిని విద్యార్థులు  చదువుతో పాటు పరిశుభ్రతను కూడ అలవర్చుకోవాలన్నారు. మీ తల్లిదండ్రులకు స్వచ్చత, పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్తను వేరు చేయడం, ఇంట్లోనే వర్మికాంపోస్టు తయారు చేయడం తదితర అంశాలపై అవగాహాన పర్చాలని పిలుపు నిచ్చారు. విద్యార్థులు మీ నివాస గృహాలు, పాఠశాలతో పాటు నగరాన్ని కూడ పరిశుభ్రంగా ఉంచేలా చూడాలని కోరారు. చెత్తను రోడ్ల పై వేయకుండ చెత్త బుట్టలోనే వేయాలని తెలిపారు. వచ్చే స్వచ్చ్ సర్వేక్షన్ పరిక్షలో నగరానికి మెరుగైన ర్యాంకు వచ్చేలే విద్యార్థిని విద్యార్థులు కూడ తమ వంతు కృషిని అందించాలన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో బాగస్వములు కావాలని పిలుపు నిచ్చారు. కరీంనగర్ నగర ప్రజలు మీ డివిజన్లలో పరిసరాలను, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి రోజు తడి పొడి చెత్తను వేరు చేసి వేరు వేరు బట్టల్లో నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మీకులకు అందించాలన్నారు.

అవసరమైతే తడి చెత్తతో మీ ఇంటి పరిసర ప్రాంతంలో వర్మికాంపోస్టు ఫిట్ ఏర్పాటు చేసి... జీవఎరువును తయారు చేయాలని పిలుపు నిచ్చారు. కాంపోస్ట్ ఎరువును ఇంట్లో పూలు, కూరగాయల మొక్కలు వేస్కోవాలన్నారు. నగరపాలక సంస్థ చేపట్టే ప్రతి స్వచ్చత కార్యక్రమంలో బాగస్వాములై పూర్తి స్థాయి అవగాహన పెంచుకొవాలని అన్నారు. స్వచ్చ్ సర్వేక్షన్ 2024 మెరుగైన ర్యాంకు వచ్చేలా ప్రజలు కృషి చేయాలని కోరారు. గత స్వచ్చ్ సర్వేక్షన్ ర్యాంకులో పోల్చితే ఈ సంవత్సరం ఇంకా మంచి ర్యాంకు నగరపాలక సంస్థ సాదించేసా మీ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమీషనర్ వేణు మాధవ్, సానిటేషన్ సూపర్ వైజర్ రాజ మనోహార్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ స్వామీ ఎస్సై వెంకన్న, పారిశుధ్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.