- స్వచ్ఛ గ్రామాలుగా మార్చడంలో దశాబ్ద కృషి
- గణనీయంగా తగ్గిన మాతా-శిశు మరణాలు
- బహిరంగ మల విసర్జన రహితంగా గ్రామాలు
- 90 శాతానికి పెరిగిన గ్రామీణ పారిశుద్ధ్యం
- దేశవ్యాప్తంగా 12 కోట్ల టాయిలెట్ల నిర్మాణం
హైదరాబాద్, అక్టోబర్ 21 (విజయక్రాం తి): గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని.. వాటి అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని మహాత్మాగాంధీ కలలుగన్నారు. ఆయన ఆశయ సాధనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న గ్రామాలను పరిశుభ్రంగా మార్చాలనే సంకల్పంతో కేంద్రప్రభుత్వం 2014, అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించు కొని స్వచ్ఛా భారత్ మిషన్‌ను ప్రారంభించింది.
2024 నాటికి స్వచ్ఛ భారత్ మిషన్‌కు పదేండ్లు పూర్తయ్యాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, బహిరంగ మల విసర్జనను తగ్గించడం, ఆరోగ్య వసతుల కల్ప న, మహిళల భద్రత, పాఠశాల స్థాయిలో డ్రాపౌట్ల నివారణ, గ్రామీణ ఉపాధి కల్పన, పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. దశాబ్ద కాలంగా స్వచ్ఛభారత్ ద్వారా ప్రభుత్వం చేసిన కృషి ఫలితాలనిస్తోంది.
తగ్గిన మాతా మరణాలు..
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల్లో మాతా, శిశు మరణాలను తగ్గా యి. 2014లో ప్రతి లక్ష మంది గర్భిణుల్లో 130 మంది ప్రసూతి సమయంలో మరణించేవారు. కానీ ప్రస్తుతం ఆ సంఖ్య 97కి తగ్గింది. గతంతో పోలిస్తే 42 శాతం తగ్గుదల నమోదైంది. 2014లో పుట్టిన ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 39 మంది మరణించగా, ప్రస్తుతం ఆ సంఖ్య 32కు తగ్గింది.
దేశవ్యాప్తంగా శిశు మరణాల్లో 28 శాతం తగ్గుదల నమోదైం ది. ఐదేళ్లలోపు ఉన్న పిల్లలు 2014లో ప్రతి వెయ్యిమందికి 45 మంది పిల్లలు మరణించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 32 మందికి తగ్గింది. ఐదేళ్లలోపు ఉన్న పిల్లల మరణాల రేటు 29 శాతం తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
బహిరంగ మల విసర్జన రహితంగా..
స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా అనేక గ్రామా లు బహిరంగ మల విసర్జన రహితంగా మారాయి. 2014లో ఓపెన్ డెఫికేషన్ 60 శాతంగా ఉండగా ప్రస్తుతం వందశాతం బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా మారాయి. స్వచ్ఛ భారత్ మిషన్‌కు ముందు దేశవ్యాప్తంగా కేవలం 12 శాతం మహిళలు మాత్రమే ఎలాంటి సంకోచం లేకుండా టాయిలెట్లను వినియోగించగా అది ఏకంగా 93 శాతానికి చేరింది.
ఈ మిషన్‌లో భాగంగా గ్రామాలను బహిరంగ మల విసర్జన రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మొత్తం రూ.1.40 లక్షల కోట్లను ఖర్చు చేసిం ది. పదేళ్లకు పారిశుద్ధ్యరంగంలో ఉపాధి అంతంతమాత్రంగానే ఉండగా.. ప్రస్తుతం ఈ రంగంలో 13.1 మిలియన్ల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం బయోఎనర్జీ ప్రాజెక్టుల ద్వారానే 1.1 మిలియన్ ఉద్యోగాలు లభించాయి.
ప్రత్యక్ష ప్రయోజనాలు..
* స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా పదేండ్లలో దేశవ్యాప్తంగా 12 కోట్ల టాయిలెట్లను నిర్మించారు.
* 5.87 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జన రహితంగా మారాయి.
* 3.92 లక్షల గ్రామాల్లో ఘన వ్యర్థాల నిర్వాహణ చేపడుతున్నారు.
* 4.95 లక్షల గ్రామాల్లో ద్రవ వ్యర్థాల నిర్వాహణ కొనసాగుతుంది.
* 7.5 మిలియన్ల పూర్తిస్థాయి ఉద్యోగాలు లభించాయి.
పరోక్ష ప్రయోజనాలు..
* శిశు మరణాలు తగ్గించడం ద్వారా ఏటా 70 వేల శిశువులను కాపాడారు.
* బహిరంగ మల విసర్జన రహిత గ్రామాల్లోని ప్రతీ కుటుంబానికి సగటున రూ.50 వేలు ఆదా అవుతోంది.
* పాఠశాల స్థాయిలో డ్రాపౌట్స్ తగ్గించడంతో చిత నిర్బంధ ప్రాథమిక విద్య నిర్విరామంగా సాగుతుంది.
* లింగ సమానత్వం పెరిగింది.
* పరిశుభ్రత, పారిశుద్ధ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరిగింది.
* పునరుత్పాదక శక్తి అవకాశాలు మెరుగయ్యాయి.