26-01-2025 12:00:00 AM
2014లో కేంద్ర ప్రభుత్వం ప్రజా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా స్వచ్ఛ భారత్ మిషన్‌ను ప్రారంభించింది. 2020 నాటికి, దేశవ్యాప్తంగా 100 మిలియన్ల మరుగుదొడ్లను నిర్మించింది. స్వచ్ఛభారత్ మొదటి ఐదు సంవత్సరాలలో జాతీయ బహిరంగ మలవిసర్జన 60శాతం నుండి 19శాతానికి తగ్గింది. టాయిలెట్ లభ్యత రెట్టింపు అయింది.
సమాచారం, విద్య కమ్యూనికేషన్ విధానాన్ని అనుసరించి, ఈ కార్యక్రమం స్థానిక సమాజ సమీకరణను కూడా నొక్కి చెప్పింది, దీనిలో ఎసెమ్మెస్, ఫోన్‌కాల్స్, కమ్యూనిటీ కార్యకర్తల ద్వారా సందేశాలు, గ్రామీణ గృహాలకు సురక్షితమైన, పరిశుభ్రమైన పారిశుద్ధ్య పద్ధతుల ప్రాముఖ్యతపై తరచూ మాధ్యమాల ద్వారా చేరవేయడం జరిగింది. భారతదేశంలో శిశు మరణాలకు, స్వచ్ఛతకు మధ్య స్పష్టమైన సంబంధాన్ని నివేదికలు తెలియజేస్తున్నాయి.
స్వచ్ఛ భారత్ ద్వారా నిర్మించబడిన మరుగుదొడ్లలో ప్రతి 10శాతంపెరుగుదల వల్ల ప్రతి 1,000 జననాలకు కేవలం 0.9 శిశు మరణాలు నమోదయ్యాయి. దేశంలోని జిల్లాలలో స్వచ్ఛ భారత్ కవరేజ్ స్థాయిలను బట్టి సంవత్సరానికి 67,235 తక్కువ శిశు మరణాలకు దారితీస్తుందని నివేదిక తెలియజేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో 5.4 మిలియన్ల మరణాలలో 14 శాతం భారతదేశం ఉన్నారు.
శిశు మరణాలు బహుళ కారణాల వల్ల సంభవిస్తున్నప్పటికీ, వీటిని తగ్గించే ప్రయత్నాలు ప్రసవానికి ముందు, ప్రసవానంతర కాలంలో ఆరోగ్య సేవలను పొందడంపై దృష్టి సారించాలి. సమగ్ర పారిశుద్ధ్య పద్ధతులు అభివృద్ధికి ఆశాజనకంగా ఉన్నప్పటికీ, పారిశుద్ధ్యంపై భారతదేశం పురోగతికి సంబంధించి సమాధానం లేని ప్రశ్నలు చాలా మిగిలి ఉన్నాయి.
మానిటరింగ్ ప్రోగ్రామ్ ఫర్ వాటర్ సప్లై, శానిటేషన్ అండ్ హైజీన్ 2020లో ప్రచురించిన నివేదికలో దేశంలో 71శాతం గృహాలు సురక్షితంగా నిర్వహించబడే పారిశుద్ధ్య వసతులు కలిగి ఉన్నాయని అంచనా వేసింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద పారిశుద్ధ్య మౌలిక సదుపాయాలు పెరిగినప్పటికీ, సురక్షితమైన పారిశుద్ధ్యాన్ని పాటించడానికి అడ్డంకులు మిగిలి ఉన్నాయి.
టాయిలెట్ల నిర్మాణం, వినియోగం మధ్య అంతరాలను మరిం త సృష్టిస్తున్నాయి. భారతదేశంలో టాయిలెట్ వినియోగాన్ని పెంచడంలో ఆర్థిక ప్రోత్సాహకాలు, కమ్యూనికేష న్ మార్పు ప్రచారాల ప్రభావాన్ని విస్తృత పరచాలి. పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగుపరచడంలో టాయిలెట్ నిర్మాణం మాత్రమే కాకుండా, ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఆ ప్రదేశంలో లేదా ఆఫ్-సైట్లో శుద్ధి చేయబడేలా చూసుకోవడం కూడా అవసరం.
మలాన్ని సురక్షితంగా పారవేయడం, పైపుల ద్వారా నీటిని పొందడం అవసరం. అది లేకుంటే, మలం నుండి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రాబల్యం పెరుగుతుంది. ఎలెక్ట్రో కొయ్యగులేషన్ లేదా ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా మలాన్ని శుద్ధి చేసి ప్రజలకు ఆరోగ్యకరమైన అలవాట్లు, శాస్త్రీయమైన పద్ధతుల ద్వారా చేరువ కావాలి.
డా. ముచ్చుకోట సురేష్ బాబు