calender_icon.png 30 April, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వచ్ఛభారత్ గ్రామీణ మిషన్ పనులు చేపట్టాలి

29-04-2025 09:32:44 PM

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 

మహబూబాబాద్ (విజయక్రాంతి): స్వచ్ఛ భారత్ గ్రామీణ మిషన్ ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఇంకుడు గుంతల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, పరిసరాల పరిశుభ్రత కోసం వివిధ పనులను చేపట్టాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్, శ్రేష్ట భారత్ మిషన్ కార్యక్రమాల అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు, విద్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, రైతు వేదికలు, గ్రామపంచాయతీ భవనాలు, అధికంగా జనం సంచరించే ప్రదేశాల్లో స్త్రీ పురుషులకు వేరువేరుగా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. అలాగే వ్యర్థాల నిర్వహణ క్రమబద్దీకరణ అంశాలను పర్యవేక్షించి డంపింగ్ యార్డ్ నిర్వహణ పై పర్యవేక్షణ చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డిఆర్డిఓ పిడి మధుసూదన రాజు, జెడ్పి సీఈవో పురుషోత్తం, డి ఏ ఓ విజయనిర్మల, డీఈవో  రవీందర్ రెడ్డి, డిపిఓ హరిప్రసాద్, సంక్షేమ అధికారిని ధనమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ దేశి రామ్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవి రాథోడ్, డిప్యూటీ డైరెక్టర్ (గ్రౌండ్ వాటర్) సురేష్, స్వచ్ఛభారత్ ఎస్ బి ఎం లు శ్రీమాన్, రవికుమార్, మిషన్ భగీరథ అధికారులు పాల్గొన్నారు.