డబ్ల్యూటీఏ ఫైనల్స్
రియాద్: డబ్లూటీఏ ఫైనల్స్‌లో ఇగా స్వియాటెక్ తన సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. గురువారం మహిళల సింగిల్స్ ఆరెంజ్ గ్రూప్‌లో స్వియాటెక్ (పోలండ్) 6-1, 6-0తో కసత్కినా(రష్యా)ను ఓడించింది. ఫలితంగా టోర్నీలో స్వియాటెక్‌కు ఇది తొలి విజయం. ఇదే గ్రూప్‌లో జెస్సికా పెగులా గాయంతో వాకోవర్ ఇవ్వడంతో స్వియాటెక్ మ్యాచ్ ఆడే అవకాశం లేదు. దీంతో సెమీస్ రేసులో నిలిచినప్పటికీ క్రెజికోవా మధ్య మ్యాచ్‌పై స్వియాటెక్ భవితవ్యం ఆధారపడి ఉంది.
ఇదివరకే గాఫ్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే. ఇక పర్పుల్ గ్రూప్‌లో ప్రపంచ నంబర్‌వన్ సబలెంకాకు ఎలీనా రిబాకినా షాక్ ఇచ్చింది. రిబాకినా (కజకిస్థాన్) 6-4, 3-6, 6-1తో సబలెంకా (బెలారస్)పై విజయం సాధించినప్పటికీ సెమీస్ చేరడంలో విఫలమైంది. ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి సబలెంకాతో పాటు క్విన్ జెంగ్ సెమీస్ చేరుకుంది.