calender_icon.png 22 December, 2024 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

777 సూత్రం సీక్రెట్

17-10-2024 12:00:00 AM

ప్రస్తుతం బిజీ జీవితంలో చాలామందికి భాగస్వామితో గడిపేందుకు సమయం ఉండట్లేదు. అయితే ఇది ఇలాగే కొనసాగితే బంధంపై ప్రతికూ ల ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా దాంపత్యంలో కలకాలం ఆకర్షణ, అనుబంధం ఉండాలంటే ‘777’ నియమం పాటించాలంటున్నారు నిపుణులు.. అదేంటో ఓసారి లుక్కేయండి.

* వారానికి ఒక్కసారైనా భాగస్వామితో గడపాలి. ఇది మొక్కుబడిగా ఉండకూడదు. సమయం లేదని దాటవేయకూడదు. దీనివల్ల ఇరువురికీ ప్రయోజనం ఉంటుంది. అనురాగం కూడా పెరుగుతుంది. 

* ప్రతి ఏడు వారాలకు కుటుంబ బాధ్యతలను పక్కన పెట్టి, ఇద్దరూ కలిసి దూరంగా ఎక్కడికైనా వెళ్లాలి. అది ఒక్క రోజైనా పర్లేదు. ఆ సమయాన్ని వారి కోసం కేటాయించుకోవాలి. భావాలను పంచుకోవాలి. దీంతో ఒకరిపై మరొకరికి భరోసా కలుగుతుంది. ఇలా గడిపే ఆ సమయం ఇద్దరినీ స్నేహితులుగా మారుస్తుంది. 

* ప్రతి ఏడు నెలలకు ఇద్దరూ తమ ఉద్యోగం లేదా కుటుంబ బాధ్యతల నుంచి కొద్ది రోజులపాటు సెలవు తీసుకోవాలి. బాధ్యతలతో వైవాహిక బంధం యాంత్రికంగా మారుతుంది. ఇలా కాకుండా భార్యభర్తలిద్దరూ ఒంటరిగా మనసుకు నచ్చిన ప్రాంతానికి వెళ్లాలి.