calender_icon.png 16 January, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిలకడగా మిజోరం గవర్నర్ ఆరోగ్యం

11-09-2024 12:29:25 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): అనారోగ్యంతో బాధపడుతూ హైదరా బాద్‌లోని నానక్‌రాంగూడ స్టార్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మిజోరం గవర్నర్ కె. హరిబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 5 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న హరిబాబు సోమవారం ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. హరిబాబుకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ ఉందని, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని స్టార్ హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు.