calender_icon.png 6 March, 2025 | 3:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిలకడగా కల్పన ఆరోగ్యం: వైద్యులు

06-03-2025 12:00:00 AM

కూకట్ పల్లి మార్చి 5(విజయక్రాంతి): ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విధితమే. ఆమె అపస్మారక స్థితిలో మంగళవారం రాత్రి హోలిస్టిక్ ఆసుపత్రిలో చేరారు. నిద్ర మాత్రలు మింగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కల్పన హెల్త్ బులిటెన్ ను ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు పేర్కొన్నారు.

ఆస్పత్రికి వచ్చేముందు నిద్ర మాత్రలు మింగడం వల్ల ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించడం జరిగిందన్నారు. లంగ్ ఇన్ఫెక్షన్ ఉండడంవల్ల చికిత్సలు నిర్వహించి వెంటిలేటర్ తీసివేయడం జరిగింది అన్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. పరిస్థితిని బట్టి 24 గంటల్లోనే డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చైతన్య తెలిపారు.

సింగర్ కల్పన తన కుటుంబంతో కేరళలోని ఎర్నాకులం జిల్లాలో నివాసం ఉంటుంది అయితే గత ఐదేళ్ల నుంచి కల్పన హైదరాబాదు నిజాంపేట్ రోడ్ లోని వర్టిక్స్ ప్రివిలేజ్ విల్లాలో అద్దెకు ఉంటున్నారు. మార్చి 3వ తేదీన తన కుమార్తె దయా ప్రసాద్ దగ్గరికి వెళ్లి చదువు విషయంలో మాట్లాడి మనస్థాపం చెందినట్లు తెలిసింది. హైదరాబాదులో తన కుమార్తెను చదువుకోమని కోరగా ఆమె నిరాకరించింది.

ఈ నెల నాలుగో తేదీన ఎర్నాకులం నుంచి హైదరాబాద్ కి వచ్చిన కల్పన మధ్యాహ్నం నిజాంపేట్ లోని తన నివాసంలో నిద్రించే ప్రయత్నం చేసింది. ఎంతకీ నిద్ర రాకపోవడంతో ఎనిమిది జోలో ఫ్రెష్ నిద్ర మాత్రలు వేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయినప్పటికీ నిద్ర పట్టకపోవడంతో మరో 10 మాత్రలు తీసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. తర్వాత ఏం జరిగిన విషయం తనకు తెలియదని పోలీసులకు కల్పన వెల్లడించింది.

కల్పన భర్త ప్రసాద్ ఆమెకు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో కాలనీ వెల్ఫేర్ సభ్యులకు సమాచారం అందించారు. వెల్ఫే సభ్యులు 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని వెల్ఫేర్ సభ్యుల సహాయంతో వంటగది డోర్ తీసి లోపలికి వెళ్లి ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను చికిత్స కోసం సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

తనకు జరిగిన ఈ సంఘటనలో ఎవరి ప్రమేయం లేదని తన కూతురికి తనకు జరిగిన విషయంలో నిద్రపట్టక అధిక మొత్తంలో నిద్రమాత్రలు తీసుకున్నదని కల్పన పోలీసులకు తెలిపింది. అప్పటికే ఆమె చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పలువురు సినీ గాయకులు ఆసుపత్రికి చేరుకొని కల్పనకు మెరుగైన వైద్యం అందించాలని గాయకులు శ్రీరామ్ సునీత గీతా మాధురి వైద్యులకు సూచించారు.

మా అమ్మది ఆత్మహత్యాయత్నం కాదు... కూతురు దయా ప్రసాద్ 

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాయని కల్పనను కూతురు దయా ప్రసాద్ బుధవారం తన తల్లిని పరామర్శించింది. తమ కుటుంబంలో ఇటువంటి కలహాలు లేవని అమ్మ ఇన్సోమియ టాబ్లెట్ ఓవర్ డోస్  కారణంగానే అపస్మారక స్థితిలోకి వెళ్లిందని కూతురు పేర్కొంది.

తన తల్లి కల్పన ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు వస్తున్న వార్తలు అవాస్తమన్నారు. గాయనిగా రాణిస్తూనే పిహెచ్డి, ఎల్.ఎల్.బి చేస్తుందని కుమార్తె పేర్కొన్నారు. దీని కారణంగానే ట్రెస్సుకు గురి కావడంతో వైద్యులు ఇచ్చిన టాబ్లెట్లను వాడుతుంది. టాబ్లెట్లు ఓవర్ డోస్ వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లిందని కూతురు మీడియాతో పేర్కొంది.