* తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకష్ణారెడ్డి
* ఎసీయూలో ప్రారంభమైన జాతీయ సదస్సు
కరీంనగర్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): కేంద్ర, రాష్ర్టల మధ్య సమగ్ర సహకారం, సుస్ధిరమైన అభివద్ధి వికసిత్ భారత్ లక్ష్యమని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకష్ణారెడ్డి అన్నారు. మంగళవారం శాతవాహన విశ్వవిద్యాల యంలో అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో వికసిత్ భారత్-2౦47 ఇండియా విజన్ ఫర్ డెవలప్మెంట్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమయింది.
ము ఖ్య అతిథిగా హాజరైన ఆయన శాతవాహన యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ కలిసి సదస్సు సావనీర్ ను ఆవిష్క రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఇప్పటి వరకు భారతదేశం కొన్ని రంగాల్లో అభివద్ధి చెందుతున్నప్పటికీ ఇంకా అనేక రంగాల్లో అభివద్ధి చెందాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందన్నారు.
ఈ బహత్తర కార్యక్రమంలో అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వీసీ ఉమేష్ కుమార్ మాట్లాడుతూ ఇంకా భారతదేశం పరిమాణాత్మకంగా, గుణాత్మకంగా అభివద్ధి సాధించాలని తెలిపారు. సెమినార్ డైరెక్టర్ డాక్టర్ కోడూరి శ్రీవాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ ఆర్ సాయన్న, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ ఎ జానయ్య, కాకతీయ విశ్వవిద్యాలయ అర్థశాస్త్ర విభాగం సీనియర్ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి సురేషాల్, ఎస్యూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్, సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం వరప్రసాద్, యూజీసీ అఫైర్స్, ఉమెన్ సెల్ డైరెక్టర్ డాక్టర్ కే పద్మావతి, విసివో డి డాక్టర్ డి హరికాంత్, విశ్వవిద్యాలయ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.