విజయ్ శంకర్, విషిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘పాగల్ వర్సెస్ కాదల్’. ఈ చిత్రానికి రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహిస్తుండగా శివత్రి ఫిలింస్ బ్యానర్‌పై పడ్డాన మన్మథరావు నిర్మిస్తున్నారు. సినిమా ఈ నెల 9న థియేట్రికల్ రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్‌లో సోమవారం నిర్వహించారు. హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను కార్తిక్ అనే క్యారెక్టర్‌లో నటిస్తున్నాను. కార్తీక్ ఇన్నోసెంట్.
ప్రేయసితో ఇబ్బందులు పడుతుంటాడు. సినిమా ప్రేమలో ఉన్న ప్రతి లవర్ రిలేట్ చేసుకునేలా ఉంటుంది’ అని అన్నాడు. ‘నేను బాయ్‌ఫ్రెండ్‌ను అనుమానంతో ఇబ్బందులు పెట్టే అమ్మాయి క్యారెక్టర్ చేశా. నేను నటించిన ‘కమిటీ కుర్రోళ్లు’, ‘పాగల్ వర్సెస్ కాదల్’ ఒకే డేట్‌కు రిలీజ్ అవుతున్నాయి. నా కెరీర్‌లో మర్చిపోలేని సందర్భం ఇది” అని హీరోయిన్ విషిక చెప్పింది.