03-03-2025 11:52:27 AM
హైదరాబాద్: మలక్ పేట జమున టవర్స్(Malakpet Jamuna Towers)లో నివాసం ఉంటున్న వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. కుటుంబసభ్యులకు చెప్పకుండా మృతదేహాన్ని తరలిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సింగం శిరీషకు గుండెపోటు వచ్చిందని అత్తింటి కుటుంబసభ్యులు తెలిపారు. తన కుమారైను హత్య చేశారని శిరీష కుటుంబీకులు ఆరోపించారు. భర్త వినయ్, అత్తమామలు కొట్టి చంపారని శిరిష కుటుంసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శిరిష గుండెపోటుతో చనిపోయిందని భర్త వినయ్ కుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అత్తమామలు, మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరకముందే మృతదేహాన్ని సొంత గ్రామం శ్రీశైలం(Srisailam) సమీపంలో దోమల పెంటకు అంబులెన్సులో తరలిస్తుండగా సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించి పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై గాయాలు ఉండటంతో కొట్టి చంపి, గుండెపోటుగా చెపుతున్నారని మృతురాలి కుటుంబసభ్యులు మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.