calender_icon.png 12 February, 2025 | 11:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..

12-02-2025 09:05:26 PM

మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌసల్య కాలనీలో ఎస్ ఆర్ గాయత్రి మహిళా కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న పూజిత (17) అనుమానాస్పదంగా మృతి చెందింది. తల్లిదండ్రులు వచ్చేలోపే మృతదేహాన్ని పోస్టుమార్టం మాత్రం ఆస్పత్రికి తరలించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు కళాశాల వద్ద ఆందోళన చేశారు. మొదట బాత్రూంలో పడిందని చెప్పారని, తర్వాత సూసైడ్ చేసుకుందని చెప్పారని అన్నారు. ఈ ఘటనతో కళాశాల విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు కళాశాలలో విద్యార్థులకు యధావిధిగా క్లాసులు నిర్వహించారు.