calender_icon.png 19 January, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్యాబ్ డ్రైవర్ అనుమానాస్పద మృతి

05-07-2024 12:10:04 AM

రాజేంద్రనగర్, జూలై 4: ఓ క్యాబ్ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందా డు. ఈ సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్షాకోట్‌లో వెలుగుచూసింది. ఇన్‌స్పెక్టర్ హరి కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన శ్రీనివాస్(40) బతుకుదెరువు కోసం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చాడు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ పరిధిలోని హైదర్షాకోట్‌లో భార్యాపిల్లలతో కలిసి ఉంటున్నాడు. అతడికి ఓ బాబు, పాప ఉన్నారు. శ్రీనివాస్ క్యాబ్ నడుపుకొంటూ కుటుం బాన్ని పోషించుకుం టున్నాడు. మూడు నాలుగు రోజులు గా అతడు ఇంటికి రాలేదని కుటుంబీకులు తెలిపారు.

ఇదిలా ఉండగా గురువారం హైదర్షాకోట్‌లోని శాంతినగర్ పార్కింగ్ ఏరియా లో తన కారులో మృతదేహంగా పడి ఉన్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న నార్సింగి ఇన్‌స్పెక్టర్ హరికృష్ణా రెడ్డి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. శ్రీనివాస్ తన కారును పార్క్ చేసిన అనంత రం వాహనంలో పడుకున్న తర్వాత విండోస్ క్లోస్ చేసి ఉండటంతో ఊపిరి ఆడక మృతిచెంది ఉండొచ్చని అనుమా నం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదని ఇన్‌స్పెక్టర్ స్పష్టం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.