29-03-2025 08:16:35 PM
పటాన్ చెరు: బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్దనూర్ కు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకు మధ్యలో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సిఐ స్వామి గౌడ్ తెలిపారు. ఆమె వయసు 40 నుండి 45 సంవత్సరాలు ఉంటుందన్నారు. శనివారం వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించి నట్లు సీఐ తెలిపారు. పసుపు రంగు అంచుతో కూడిన నీలి రంగు చీర ధరించి ఉన్నట్లు చెప్పారు. ఆమె కుడి చేతిపై నరేందర్ అని తెలుగులో SaiSatvik అని ఇంగ్షీషులో పచ్చ బొట్టు ఉందని చెప్పారు. అలాగే ఎడమ చేతిపై Narendar అని ఇంగ్లీష్ లో పచ్చ బొట్టు ఉందన్నారు. ఎవరైనా గుర్తిస్తే 8712656727 నెంబర్ కు లేదా బీడీఎల్ భానూర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం తెలియజేయాలన్నారు.