20-03-2025 08:37:48 PM
జుక్కల్ (విజయకాంతి): జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామానికి చెందిన బిచ్కుంద భూమయ్య అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఈనెల 18న రాత్రి తండ్రి కొడుకుల మధ్య జరిగిన వాగ్వివాదంలో తండ్రి అయిన మృతుడు ఉరి వేసుకొని మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గొడవకు ఆస్తి కారణమే అని వారు చెప్పారు. గొడవ జరిగిన కొద్దిసేపటికి ఈ విధంగా జరిగిందన్నారు. ఇదిలా ఉండగా ఈనెల 19న కూతురు శోభ రాణి జుక్కల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు అందుకున్న ఎస్ఐ భువనేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారంగా దరఖాస్తులో అది ఆత్మహత్య కాదని హత్యగా భావిస్తున్నట్లు కూతురు అందులో పేర్కొనడం జరిగిందన్నారు. గొంతు చెట్టు గాయాలతో పాటు పురుసల వద్ద రక్తం మరకలు ఉన్నట్లు కూతురు దరఖాస్తులో పేర్కొన్నారని చెప్పారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుకున్నట్లు ఆయన చెప్పారు.