calender_icon.png 18 March, 2025 | 7:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

అనుమానా స్పదంగా వ్యక్తి మృతి?

17-03-2025 12:00:00 AM

పెబ్బేరు, మార్చి 16: ఒక వ్యక్తి అనుమాన స్పదంగా వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెబ్బేరు మండల పరిధిలోని రంగాపూర్ గ్రామ శివారులో లిక్కర్ ఫ్యాక్టరీ సమీపంలో గుర్రం గడ్డ బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుంది. బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా కూలీ పని చేయడానికి ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తులు వలస వచ్చారు.

హోలీ పండుగ రోజున 6గురు వ్యక్తులు గుర్రం గడ్డ గ్రామంలో పీకలదాక మద్యం సేవించారు. తిరుగు ప్రయాణంలో 6గురిలో ఒకరు మనీష్ (20)గళ్లంతయ్యడు. శనివారం బ్రిడ్జి సమీపంలో ఒక గుంతలో శవమై తేలాడు. చుట్టుపక్కల రైతులు గమనించి బ్రిడ్జి నిర్మాణదారులకు సమాచారం అందించారు. హత్యకు గురయ్యాడ లేక కృష్ణానది పరివాహక ప్రాంతంలోని గుంత ల్లో ముసలికి బలయ్యాడనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తే వాస్తవాలు బట్టబయలవుతాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. మృత దేహాన్ని గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో చుట్టుపక్కల వ్యవసా య పొలాలకు వెళ్లాలంటే రైతులు భయబ్రాంతులకు గురవుతున్నారు.