పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలోని చెలిమిళ్లకు చెందిన దూపం పెద్దన్న (55)మంగళవారం మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని ఏళ్ల నుంచి మృతుని కుటుంబంలో తరచుగా గొడవలు జరిగేవి. రోజులాగే సోమవారం కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరగడంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు దూపం పెద్దన్న వెళ్ళగా పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించి గొడవకి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు సామరస్యంగా మాట్లాడుకొని తిరిగి వెళ్ళేపోయారు. మంగళవారం తెల్లవారు జామున దూపం పెద్దన్న ఉరి వేసుకొని ఉన్న సంఘటనను కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని మరణంపై అనుమానాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతునికి భార్య దూపం లక్ష్మితో పాటు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నట్లు స్థానికులు పేర్కొన్నారు.