calender_icon.png 22 December, 2024 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గచ్చిబౌలిలో నర్సింగ్ విద్యార్ధి ఆత్మహత్య

16-09-2024 09:53:44 AM

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో దారణం చోటుచేసుకుంది. నర్సింగ్ విద్యార్థిని చిన్న అంజయ్యనగర్ వద్ద హోటల్ లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు శృతిగా గుర్తించిన పోలీసులు ఆమె స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లగా గుర్తించారు. గతంలో శృతి యశోద హాస్పిటల్ లో నర్సుగా పనిచేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన గచ్చిబౌలి పోలీసులు నర్సింగ్ విద్యార్థిని మృతి ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని గచ్చిబౌలి పోలీసులు వెల్లడించారు.