calender_icon.png 12 January, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం ఇంటి వద్ద అనుమానాస్పద బ్యాగ్

16-09-2024 12:00:00 AM

ఏమీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న అధికారులు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి అతి సమీపంలో ఓ అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివా సం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ బ్యాగ్‌ను వదిలివెళ్లారు. అనుమానాస్పద బ్యాగ్‌ను గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది ఇంటెలిజెన్స్ సిబ్బందికి సమాచారం అందించగా, అక్కడకు చేరుకొని బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. దానిని అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి తనిఖీ చేయ గా బ్యాగ్‌లో పేలుడు పదార్థాలు ఏమీ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ బ్యాగ్‌ను ఎవరు వదిలి వెళ్లారనేది జూబ్లీహిల్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.