04-03-2025 02:11:21 AM
హైదరాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): దుబాయ్‌లో అనుమానస్పద స్థితిలో చనిపోయి న సినీ నిర్మాత కేదార్ మృతిపై అనుమానాలున్నాయని, కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశా రు.
ప్రతీ అంశాన్ని సోషల్ మీడియాలో పెట్టే హరీశ్‌రావు దుబాయ్ పర్యటన వివరాలు ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు. మార్చి 6వ తేదీ న పెళ్లి ఉంటే ఫిబ్రవరి 22న ఎవరి పెళ్లికి బ్యాండ్ కొట్టడానికి హరీశ్‌రావు దుబాయ్‌కి వెళ్లారో చెప్పాలని ఎంపీ చామల ప్రశ్నించారు. హరీశ్‌రావు దుబాయ్ వెళ్లిన రోజే అక్కడ కేదార్ చనిపోయారాని ఎంపీ చామల తెలిపారు.
సోమవారం ఆయ న గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనాన్ని తెల్లదనంగా మార్చుకోవడానికి రాజకీయ నాయకులు దుబాయ్ వెళ్తారని, ఇక్కడ లూటీ చేసిన పైసలు దుబాయ్‌లో దాచుకోవడానికి హరీశ్ దుబాయి వెళ్లాడని ఆరోపించారు.
హరీశ్‌రావుకు శవరాజకీయాలు కొత్త కాదన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేసేవారన్నారు. గతంలో ప్రమాదాలు జరిగితే కేసీఆర్ ఎప్పుడైనా వెళ్లారా అని నిలదీశారు. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రతిపక్షాలు సహకరించాన్నారు.