calender_icon.png 23 January, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయువు తీసిన అనుమానం

16-07-2024 03:12:05 AM

  • భార్య గొంతు కోసి.. తర్వాత తానూ గొంతు కోసుకున్న భర్త 
  • ఘటనలో భార్య మృతి.. భర్తకు వైద్య చికిత్స 
  • ఆదిలాబాద్ జిల్లా బేలా మండలంలో ఘటన

ఆదిలాబాద్, జూలై 15 (విజయక్రాంతి): అనుమానం పెనుభూతమై భార్యను మట్టుపెట్టేలా తీసింది. తర్వాత భార్య కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన  ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైద్‌పూర్‌కు చెందిన ఏల్చల లక్ష్మణ్, ఇదే గ్రామానికి చెందిన సునీత (30) తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. లక్ష్మణ్ కొంతకాలం నుంచి భార్యపై ఉన్న అనుమానం పెంచుకున్నాడు.

ఇదే విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. సోమవారం తిరిగి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న లక్ష్మణ్ కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు. అనంతరం అదే కత్తితో తన గొంతుకోసుకున్నాడు. రక్తపు మడుగులో ఉన్న లక్ష్మణ్‌ను గ్రామస్తులు ఆదిలాబాద్‌కు రిమ్స్‌కు తరలించారు. సైద్‌పూర్‌లో ఘటనా స్థలాన్ని డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ సాయినాథ్, ఎస్సై పురుషోత్తం పరిశీలించారు.

మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుమారుల ముందే తల్లి సునీతపై తండ్రి కత్తితో దాడి చేయడం, అనంతరం తండ్రి కూడా గోంతు కోవడాన్ని చూసి కుమారలిద్దరూ భీతిల్లారు. అమ్మ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లడం, తండ్రి కటకటాలపాలవుతుండటంతో చిన్నారులు అనాథలుగా మిగిలే పరిస్థితి తలెత్తింది.