న్యూఢిల్లీ: ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ సారథి రిషబ్ పంత్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ఆదివారం బెంగళూరుతో జరగనున్న మ్యాచ్ కు పంత్ అందుబాటులో ఉండకుండా పోయాడు. మంగళవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు పాల్పడినందుకు పంత్‌పై సస్పెన్షన్‌తో పాటు రూ. 30 లక్షల జరిమానా పడింది. ‘పంత్‌కు జరిమానాతో పాటు ఒక మ్యాచ్ నిషేధం విధించాం. ఈ నెల 7న రాజస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఢిల్లీ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లం ఘించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా అతడికి జరిమానా పడింది. సీజన్‌లో ఇలా జరగడం మూడోసారి కావడంతో పంత్‌పై ఓ మ్యాచ్ నిషేధం విధిం చాం. జట్టులోని మిగతా సభ్యులపై కూడా రూ. 12 లక్షల చొప్పున జరిమానా విధించాం. మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని ఢిల్లీ సవాలు చేసింది. బీసీసీఐ అబుండ్స్‌మన్ రివ్యూను పరిశిలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ వెల్లడించింది.