హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): హిందీ పండిట్ల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియలో జరిగిన పొరపాట్లకు సంబంధించి ఖమ్మం జిల్లాలో ఇద్దరు ప్రధానోపాధ్యాయులను అధికారులు సస్పెండ్ చేశారు. దీన్ని గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ రాజభాను చంద్ర ప్రకాష్, ప్రధాన కార్యదర్శి ఆర్ రాజ గంగారెడ్డి, కోశాధికారి బీ తుకారం శుక్రవారం ఓ ప్రకటనలో ఖండించారు.
వెంటనే ప్రధానోపాధ్యాయులపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పొరపాట్లు జరగడాన్ని కారణమైన ఖమ్మం జిల్లా విద్యాధికారి, ఇతర సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా విద్యాధికారి బాధ్యత వహించాల్సిన అంశంలో హెచ్‌ఎంలను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు.