భైంసా, నవంబర్ 12 (విజయక్రాంతి) : బాసర ఆర్జీయూకేటీలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను తొలగించినట్లు జిల్లా ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. ఆర్జీయూకేటీలో సోమవారం విద్యార్థిని ఆత్మహత్య ఘట నకు నిరసనగా ఏబీవీపీ నాయకులు యూనివర్సిటీలోకి చొరబడే ప్రయ త్నం చేశారు. ఆ సమయంలో సెక్యూరిటీ గార్డులు, నాయకులకు మధ్య జరిగిన ఘర్షణలో పలవురికి గాయాలయ్యాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేసినట్లు ఎస్పీ ఓ ప్రకటనలో తెలిపారు.